Magazines

యూనిక్‌ కథతో ‘కల్ట్‌’

1 గంట క్రితం

Cult unique story
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో విశ్వక్‌సేన్ నటిస్తున్న నూతన సినిమా ‘#కల్ట్‌’. ఇందులో ఆయన హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 30న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ, ‘మనం ఎప్పుడూ భయం, స్ట్రెస్, యాంగ్జైటీ తీసుకో కూడదు. ఇవ్వాలి.. ఇచ్చి పడేయాలి. ఇది చాలా గ్రాండ్ ఫిల్మ్. ఇందులో ఎలాంటి ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఉండవు. చాలా హానెస్ట్‌గా ఈ సినిమా చేశాం. ఇందులో 150 మంది ప్రొఫెషనల్ యాక్టర్స్ ఉన్నారు. ఈ సినిమా మొదటి ఐదు నిమిషాలకే మీ అందరినీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

మీకు ట్రైలర్ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది గ్లోబల్ కంటెంట్. అందుకే సినిమాని జపనీస్, స్పానిష్ భాషల్లో డబ్ చేశాం. ఇది భాషను దాటి వెళ్లే సినిమా. యాక్షన్ కంటే ఆడియన్స్ డ్రామాకి కనెక్ట్ అవుతారు. నేను ఎక్స్‌పె రిమెంట్ చేసిన ప్రతిసారీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అదే నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను’ అని అన్నారు. తారక్ పొన్నప్ప మాట్లాడుతూ, ‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ‘పుష్ప’లో చేసిన క్యారెక్టర్ తర్వాత మరో స్థాయిలో చేసిన క్యారెక్టర్ ఇది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన విశ్వక్‌కి థాంక్యూ. కచ్చితంగా మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది చాలా యూనిక్‌ కథతో ఉంటుందిది’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్