2018లో విడుదలై ఘన విజయం సాధించిన ‘హుషారు’ సినిమాకి సీక్వెల్‌గా ‘హుషారు 2’ను దర్శకుడు శ్రీ హర్ష అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్ర టైటిల్ అనౌ న్స్మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రెట్టింపు ఫన్, మ్యాడ్‌నెస్, నాన్‌స్టాప్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘హుషారు 2’ తెరకెక్కనుంది. సినిమా ప్రధాన షూటింగ్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఏడాది చివర్లో సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి అంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట, విధి యాదవ్, అభిజ్ఞ ఉతులూరు, భగవాన్ తివారి, జతిన్ గోసామి, రజయ్ రోవన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: శ‌్రీహర్ష కొనుగంటి, నిర్మాణ సంస్థలు: కేవ్‌మ్యాన్ స్టోరీస్, హెచ్‌కె ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్, నిర్మాతలు: రాహుల్ వర్మ, కె.వీణా రాణి, కె.హనుమంత్ రాజు, సహ నిర్మాత: కోమటిరెడ్డి శరణ్ రెడ్డి, సినిమా టోగ్రఫీ: జి.శ్రీనివాస్ రెడ్డి, మ్యూజిక్: సన్ని ఎం.ఆర్, అడిష నల్ మ్యూజిక్ డైరెక్టర్: రామ్ మిర్యాల, ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి, ఆర్ట్ డైరెక్టర్: శ‌్రీకాంత్ రామిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూ సర్: జక్కుల వెంకటేష్ యాదవ్, అసోసియేట్ ప్రొడ్యూసర్: దేవన పల్లి తిరుపతి.







కామెంట్‌లు (0)