శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పి స్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మహిమా నంబియార్ మీడియాతో ముచ్చటించారు. తెలుగులో ఇది నా తొలి సినిమా. శ్రీ విష్ణు వంటి స్పాంటేనిటీ ఉన్న యాక్టర్‌తో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్. ఆయన చాలా టైమింగ్ ఉన్న యాక్టర్. నేను చేసిన తమిళ్, మలయాళ సినిమాలు చూసి దర్శకుడు నన్ను ఎంపిక చేశారు. ఆయన చెప్పిన కథ చాలా నచ్చింది. ఇందులో నాది చాలా ఫన్ క్యారెక్టర్. నా పాత్ర పేరు సితార దేవి. పక్కింటి అమ్మాయి లాంటి పాత్ర. చాలా ఇన్నోసెంట్. ఒరిస్సా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తా. ఆ భాష కారణంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఫన్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ‘ఒడియా పిల్లా’ పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ డిఫరెంట్‌గా ఉం టాయి. ప్రతి భాషలో కొత్త కొత్త పాత్రలు చేయాలనేది నా డ్రీమ్. ఇప్పటివరకు నేను చేసిన సినిమా లన్నీ దేనికవే ప్రత్యేకం. ఇది మంచి కమర్షియల్ ప్యాకేజ్ సినిమా. ఇందులో నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఉంటుంది. కానీ దాన్ని చాలా కామికల్‌గా డీల్ చేశారు. ఈ సినిమాని మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.







కామెంట్‌లు (0)