Magazines

మరోమారు వాయిదా

5 గంటల క్రితం

Postponed
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

ఈనెల 9న విడుదల కావాల్సిన ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47- ఏకే47’ సినిమా మరోమారు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియాతో మాట్లా డుతూ,‘మూడు నాలుగు రోజుల క్రితం కూడా ఈనెల 9నే సినిమా విడుదలవుతుందని మేమందరం ఎంతో నమ్మకంగా ఉన్నాం. అందుకే ఓవర్సీస్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేయించాం. కానీ, నిన్న ఉదయానికి కూడా ఓవర్సీస్ సెన్సార్ కి కంటెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పరంగా మూడు నాలుగు రోజులు వెనకబడిపోయాం. ఈ పరిస్థితుల్లో కంగారుగా సినిమాను విడుదల చేసేకంటే.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని, క్వాలిటీ అవుట్ పుట్ తో మీ ముందుకు రావాలనే ఉద్దేశంతోనే ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నాం. పైగా, ప్రమోషనల్ కార్యక్రమాలకు కూడా సమయం లేకుండా పోయింది. రెండు మూడు వారాల తర్వాత సరైన తేదీ చూసుకొని, వెంకటేష్‌తో చర్చించి, కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. మిగతా పాటలను, ట్రైలర్ ను విడుదల చేసి రాబోయే రెండు మూడు వారాల పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. వీలైనంత త్వరగా మీ ముందుకు వస్తాం. ఈ సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినా, వెంకటేష్ అభిమానులంతా నూటికి నూరు శాతం సంతృప్తి చెందేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు. హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్