Magazines

‘రణబాలి’ రిలీజ్‌కి రెడీ

4 గంటల క్రితం

Ranabali
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ వుతోంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ని మేకర్స్ చేశారు. ఈ నెల 8వ తేదీన ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ పై మూవీ లవర్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ రాగా, విజయ్, రష్మిక చేస్తున్న ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ వైరల్ గా మారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ట్రైలర్ తో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడనుంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుందని మేకర్స్‌ నమ్మకం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్