శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈనెల 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. కళ్యాణ్ ఓ లోకల్ థియేటర్‌ను నడుపుతుంటాడు. అతని అమ్మ మాత్రం నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని. సరదాగా సాగిపోయే కళ్యాణ్ జీవితంలోకి ఒడిశాకు చెందిన ఓ అమ్మాయి వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ తాడు. అయితే భాషా సమస్య వీరి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. ఇంతలో కళ్యాణ్ కోసం పోలీసులు వేట మొదలుపెడతారు. అతను మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అని తెలిసి కథ ఒక్కసారిగా సీరియస్ మలుపు తిరుగుతుంది. జైలులో ఉన్న తమ నక్సలైట్ సహచరులను విడిపించేం దుకు కళ్యాణ్, అతని గ్యాంగ్ ఓ కీలక రాజకీయ నాయకుడిని కిడ్నాప్ చేయడం ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటివరకు కనిపించిన సరదా ప్రపంచం వెనుక ఉన్న అసలు సంఘర్షణను ఈ ట్విస్ట్ బయటపెడుతుంది. 1992లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ట్రైలర్‌లో శ్రీ విష్ణు అదరగొట్టారు. మొదటి సన్నివేశం నుంచే తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఒడిశా అమ్మాయి పాత్రలో మహిమా నంబియార్ ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. శ్రీ విష్ణుతో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. అతని తల్లిగా రాధికా శరత్‌కుమార్ బాలకృష్ణకు వీరాభిమానిగా ఆమె పాత్ర ఆసక్తిని పెంచుతుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.







కామెంట్‌లు (0)