పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన సినిమా ‘గరివిడి లక్ష్మి’. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు.
గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించారు. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో గాయని గరివిడి లక్ష్మికి మేకర్స్ సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘నా కథ కోసం డైరెక్టర్ గౌరీ నాయుడు చాలా తిరిగాడు. తను పడిన శ్రమ చూసి నా కథ చెప్పాను. అలా చెప్పినందుకు ఈ రోజు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. నేను బుర్రకథ ఆడాను. బుర్రకథలో నాకు పేరు ఉంది.
కానీ ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. నిర్మాత కృతి చిన్న పాప. తనకు నా కథను ఎందుకు తీసుకోవాలనిపించిందో తెలియదు. నా కథను సినిమాగా చేసినందుకు, సినిమా చూసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన వాళ్లందరూ కూడా నాలాగే ఆనంది చేసిందని చెబుతుంటే ఆనందంగా అనిపించింది’ అని తెలిపారు.
‘చాలామంది ‘ఈ స్టోరీని నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఇందులో ఏం స్పెషాలిటీ కనిపించింది?’ అని అడిగారు. నా తొలి సినిమా కచ్చితంగా కొత్త కంటెంట్ ఉన్న సినిమా చేయాలను కున్నాను. నిజానికి గరివిడి లక్ష్మి కథ విన్నప్పుడు బుర్రకథ అంటే ఏంటో, ఈ జనరేషన్‌కు ఆ కళారూపం గురించి తెలుసా అనే ఐడియా కూడా నాకు పెద్దగా లేదు. కాకపోతే, ఆ లెగసీని, కల్చర్‌ను ఈ జనరేషన్‌కు చూపించాలనుకున్నాను. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ రాసిన గౌరీకి ధన్యవాదాలు’ అని నిర్మాత కృతి ప్రసాద్ చెప్పారు.
నేనెవరో ప్రపంచానికి తెలిసింది
56 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)