నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. బద్రప్ప గాజుల దర్శకుడు. ఈ నెల 30న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రెండు వారాల ముందుగానే ఈనెల 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ మంగళవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే మూవీ లవర్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ కూడా చాట్ బస్టర్స్ అయ్యాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ‘ఆద్యంతం వైవిధ్యభరితంగా సాగే సినిమా ఇది. ఇది మామూలు కళ్యాణం కాదు.. క్రేజీ కళ్యాణం అని ప్రేక్షకులందరూ ప్రశంసించేలా ఉంటుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ - సాయి కదిర, ప్రొడక్షన్ డిజైనర్ - శ్రీపాల్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూ సర్ - అఖిల్ సాయి శ్రీమూర్తి, లిరిక్స్ - గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, ఎడిటర్ - శ్రావణ్ కటికనేని, డీవోపీ - శ్యామ్ దూపాటి, మ్యూజిక్ - సురేష్ బొబ్బిలి, స్క్రీన్ ప్లే - శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్), ప్రొడ్యూసర్ - బూసం జగన్ మెహన్ రెడ్డి, స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్, డైరెక్షన్ - బద్రప్ప గాజుల.







కామెంట్‌లు (0)