హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా సినిమా ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. సాత్విక వీరవల్లి కథానాయిక. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ప్రీమియర్స్ నిన్న రాత్రి జరిగాయి. రాత్రి పది గంటల నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. పత్రికాధిపతులు కూడా ఫోన్ చేసి చాలా గొప్ప సినిమా తీశారని మెచ్చు కున్నారు. కొంతమంది ఎమోషనల్‌గా ఫోన్ చేశారు. ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మేం ఊహించిన దానికి 10 రెట్లు రెస్పాన్స్ మీడియా నుంచి, ప్రేక్షకుల నుంచి వస్తుంటే నాకు ఒక కొత్త అనుభూతి కలిగింది. ఒక మంచి సినిమా తీస్తే ఇంతగా ఆదరిస్తారా అనిపించింది. ఈ సినిమాలో హీరో, విలన్ అంటూ ఏమీ లేరు. అన్ని పాత్రలే ఉన్నాయి. మా దర్శకుడు పవన్ సాదినేని సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నా మిత్రుడు గున్నం గంగరాజు ఎక్సలెంట్ స్క్రీన్‌ప్లే అమర్చాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన దుల్కర్‌కి థాంక్యూ. తను ఈ సినిమాలో జీవించాడు. సాత్విక ఈ సినిమాతో చాలా పెద్ద స్టార్ అయిపోయింది’ అని తెలిపారు.
‘ప్రేక్షకులు చాలా గొప్ప, అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని నిర్మాత అశ్వినీదత్ చెప్పారు.
డైరెక్టర్ పవన్ సాదినేని మాట్లాడుతూ, ‘ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్, సపోర్ట్ అన్‌బిలీవబుల్. సినిమా విడుదలైనప్పటి నుంచి, నిన్న ప్రీమియర్ నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. అదే ఈ సినిమా విజయానికి కొలమానం. మేము ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ప్రేక్షకులు అది బాగా రీచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.







కామెంట్‌లు (0)