Magazines

చరిత్రలో ఇదే తొలిసారి

7 గంటల క్రితం

history
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

సంతోష్ దవాఖర్ దర్శకత్వంలో రూపొందిన భారతదేశ ఆస్కార్ ఎంట్రీ చిత్రం ‘గోంధళ్’. ఈ సినిమా శుక్రవారం భారత దేశ వ్యాప్తంగా ఏడు భాషల్లో రీ-రిలీజ్ కావడం ఓ విశేషమైతే, 25 నిమిషాల సింగిల్ టేక్ (ఒకే షాట్) సన్నివేశాన్ని చిత్రీకరించిన తొలి భారతీయ చిత్రం కూడా ఇదే కావడం మరో విశేషం. 99వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్)కు భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎం పికైన ‘గోంధళ్’ చిత్రం దేశ వ్యాప్తంగా హిందీ, మరాఠీ, తమి ళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్—థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. ఒక మరాఠీ చిత్రం ఏడు భాషల్లో రీ-రిలీజ్ కావడం చరిత్రలో ఇదే మొదటిసారి. రచయిత-దర్శకుడు సంతోష్ దవాఖర్ మాట్లాడుతూ, “గోంధళ్ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. తరాల నాటి సంస్కృతి, ప్రజ లు, సంప్రదాయాల కలయిక.

ఈ సంప్రదాయాన్ని ప్రపంచానికి పరి చయం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అకాడమీ అవార్డ్స్ వంటి అంతర్జాతీయ వేది కలు మన మూలాలను, సంస్కృతిని కేవలం భారతదేశానికే పరిమితం చేయకుండా ఖండాంతరాలకు తీసు కెళ్లడానికి చిత్రనిర్మాతలకు ఎంత గానో తోడ్పడతాయి’ అని అన్నారు. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సంతోష్ దవాఖర్ ఉత్తమ దర్శకుడిగా 'సిల్వర్ పీకాక్' అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రాన్ని ఫెస్టివల్ జ్యూరీ సభ్యులు, ‘నిజ జీవితంలో జరిగే ఒక షేక్స్పియర్ కథలా ఉంది’ అని ప్రశంసించారు. ఇషితా దేశ్‌ముఖ్, కిషోర్ కదమ్, యోగేష్ సోహాని, నిషాద్ భోయిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దవాఖర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సంతోష్ దవాఖర్, దీక్షా దవాఖర్ సంయుక్తంగా నిర్మించారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించి, కథా సారాంశాన్ని అద్భుతంగా ఆవిష్క రించారు. అంతేకాకుండా, హృద యాలను హత్తుకునే “చందన” అనే పాటకు ఆయనే స్వయంగా సాహిత్యం కూడా అందించారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్