హీరో నాగ చైతన్య ‘వృషకర్మ’ సినిమాతో ప్రేక్షకులను మైథాలజీ, మిస్టరీతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాను బాపినీడు సమర్పిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమాలోని రెండో పాట ‘ఛలో పదవే’ మొదటి పాటలోని ఎనర్జీకి భిన్నంగా, ఈసారి మనసును హత్తుకునే మెలోడీతో కథలోని సున్నితమైన భావోద్వేగాలను చూపించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ, ‘ఇందులో నేను అర్జున్ అనే పాత్రలో నటించాను. తను ఒక ట్రెజర్ హంటర్. ఈ సినిమాలోని ప్రతి లేయర్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఫ్రెష్‌గా ఉంటుంది.
డైరెక్టర్ కార్తీక్ ప్రతి క్యారెక్టర్‌ను ఒక కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇది ఒక లార్జ్ స్కేల్ థియేట్రికల్ స్పెక్టికల్. తెలుగు ఆడియన్స్‌కు చాలా కొత్తగా ఉండబోతోంది. మీరు భారీ అంచనాలతో రండి. కచ్చితంగా మీ అంచనాలను అందుకుంటామని నమ్ముతున్నాం’ అని అన్నారు.
‘నేను అక్కినేని నాగేశ్వరరావు అభిమానిని. ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాగ్జరునతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా కోసం చాలా గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనిచేశారు. ఇందులో నాగచైతన్య ఎక్స్ట్రార్డినరీగా ఉన్నారు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాం’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ చెప్పారు.







కామెంట్లు (0)