Magazines

నేనెందుకు రాయాలి?

56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం



నేనెందుకు రాయాలి

నాకులభించే జ్ఞాపికలకోసమా!

నా ఇంట్లో గోడలకు వ్రేలడబడ్డ ప్రశంసా

పత్రాల ఫొటో ఫ్రేముల కోసమా!

నేనెందుకు రాయాలి!

సమాజం తగలబడి పోతోంది

ప్రశ్నించలేని యువతర మొకటి

సందుల్లో గొందుల్లో

పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లోనేకాదు

మహానగరాల్ని ఆవగించి అంధత్వంలో మునిగి తేలుతుంది

పిట్ట గుడ్లను మింగే పాములకు పాలుపోస్తూ

తప్పును ప్రశ్నించడం చేతకాని

ఒక యువతరం తిరుగుతోంది

వీరిపై రాయాలా కవిత?

ఎందుకు రాయాలి నేనెందుకు రాయాలి!

తప్పును తప్పూ అని నినదించే

నిరుద్యోగ యువతను నిందించే నీచులకోసం

నేను ఎందుకు రాయలి?

ఆకలితోనే కడుపులు నింపుకొమ్మని

అది మన ఖర్మ అని చెపుతూ రోజు రోజుకీ

చాంధస భావాలను రేచ్చగొట్టి

తనను దోచుకుతినే కీచకుల సంకన చేరి

అన్యాయాన్నెదిరించే యువతను నిందించే

సిగ్గులేని దిగంబర మనుషుల పై

ఏమని రాయాలి!

హక్కులకై పోరాడే అతివల మానంపై

కొట్టిన వారిని సమర్ధించే

రాక్షస మనస్కుల నేమనాలి

వారి దుర్మార్గంపై ఏమని రాయాలి

ధర్మాన్ని కాపాడుతాం

సమాజన్ని రక్షిస్తాం అని ప్రగల్భాలు పలుకుతూ

అధికారంలో కూర్చుని అబలల మాన ప్రాణాలను

దోచే కీచకుల సమర్ధించే నీతిలేని

మృగాలపై ఎంతని రాయాలి

ఈ కవితారణ్యంలో అక్షరాల విలుకాడిగా

నేను తప్పని సరియై రాయవలసి వస్తే

సామాన్యుడిపై జరుగుతున్న

దోపిడీ పై రాస్తాను

ప్రాణాలకు తెగించి అన్యాయంపై

తిరగబడె వీరులపై రాస్తాను

అణిచేయ బడుతున్న

సామ్యవాదం పై రాస్తాను

సముద్ర గర్భంలో దాగివున్న విప్లవ

బడబానలం పై రాస్తాను

విప్లవాన్ని స్వప్నిస్తాను

సమ సమాజాన్ని స్పర్షిస్తాను

నవ యుగానికై రాస్తాను

- మధు మోహన్ వుదయగిరి, 9966460333


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్