Magazines

నవ్వుల్‌ పువ్వుల్‌.!!!

2 రోజుల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

బ్యాంక్ పాస్‌వర్డ్

ఫ్రెండ్‌-1: ఆన్‌లైన్ బ్యాంక్ పాస్‌వర్డ్ ఏంటి?

ఫ్రెండ్‌-2: సీతా-రాముడు-లక్ష్మణ్-హనుమాన్-రావణ్-ఢిల్లీ-సంపూర్ణేష్ బాబు

ఫ్రెండ్‌-1: అదేంటి రా... నీకు మరీ జాగ్రత్త కాకపోతే అంత పెద్ద పాస్‌వర్డా?

ఫ్రెండ్‌-2: నాకు మాత్రం ఏం సరదా రా... 5 అక్షరాలు ఉండాలి అని అడిగింది రా... అందుకే సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణ్ అని పెట్టా...

ఫ్రెండ్‌-1: మరి ఢిల్లీ ఏంటి రా?

ఫ్రెండ్‌-2: రాజధాని కూడా కావాలంటరా...

ఫ్రెండ్‌-1 : మరి సంపూర్ణేష్ బాబు ఎక్కడ నుండి వచ్చాడు రా?

ఫ్రెండ్‌-2: వాడిని స్పెషల్ క్యారెక్టర్ కిం పెట్టారా !!

ఫ్రెండ్‌1: నువ్వు సూపర్ రా

ఇలా వెళ్లాలి...

‘‘సార్... సార్... బార్బర్ షాపుకి ఎలా వెళ్లాలి’’ అని ఊరికి వచ్చిన పెద్దమనిషి బాబును అడిగాడు.

"జుట్టు బాగా పెంచుకుని వెళ్ళాలి." చెప్పాడా బాబు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్