Magazines

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్‌ రూ.కోటి విరాళం

17 నిమిషాల క్రితం

The goal of the ‘IRC’ is the construction of smart roads.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సాయం

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

మంచిరేవులలోని యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ మౌలిక వసతుల అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్‌ రూ.కోటి విరాళం చెక్కును బుధవారం డీజీపీ సి.వి.ఆనంద్‌కు అందజేసింది. అరోబిందో ఫార్మా లిమిటెడ్‌ వైస్‌ చైర్మెన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌, అరోబిందో ఫార్మా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ కె. నిత్యానంద రెడ్డి తరఫున ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ హెడ్‌ ఎస్‌.సదానంద రెడ్డి, అరోబిందో ఫార్మా లిమిటెడ్‌ కార్పొరేట్‌ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఐ.ఎస్‌.ఆర్‌. రావు ఈ చెక్కును డీజీపీకి అందించారు. ఈ విరాళం అందించడంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, సంగారెడ్డి ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ప్రత్యేక చొరవ చూపారు. ఫౌండేషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, విరాళం అందేలా కృషి చేశారు. పాఠశాలలో మెరుగైన విద్యా సదుపాయాల కల్పన, మౌలిక వసతుల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలను కల్పించేందుకు ఈ ఆర్థిక సాయం దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో డీజీపీ సి. వి. ఆనంద్‌, మహిళా భద్రతా విభాగం డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, ఏడీజీ (శాంతిభద్రతలు) అకున్‌ సబర్వాల్‌ తోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్