Magazines

'ఆత్మరక్షణ' పేరిట అమెరికా దాడి

9 నిమిషాల క్రితం

US attack in the name of 'self-defense'
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

ఇరాన్‌ క్షిపణి ప్రయోగ కేంద్రమే లక్ష్యం

కువైట్‌, బహ్రెయిన్ పై టెహ్రాన్‌ ప్రతి దాడులు

టెహ్రాన్‌ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 'ఆత్మరక్షణ' పేరిట అమెరికా దళాలు మంగళవారం ఖెష్మ్‌ దీవిలోని ఇరాన్‌ క్షిపణి ప్రయోగ కేంద్రంపై దాడులు జరిపాయి. అమెరికా సిబ్బందిని, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) జరిపిన దాడులకు ప్రతిగానే తాము ఈ దాడి చేశామని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. మధ్యప్రాచ్యంలోని అమెరికన్లను కాపాడుకోవడానికి యూఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ అత్యంత అప్రమత్తంగా, పూర్తి సన్నద్ధంగా ఉన్నదని ఆయన చెప్పారు. ఖెష్మ్‌ దీవిలోని ఓ నగర శివారు ప్రాంతాన్ని శత్రు సేనలు లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా తెలియజేసింది. అయితే ఈ దాడి కారణంగా కీలక మౌలిక సదుపాయాలు, వాణిజ్య-నివాస ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగలేదని హార్ముజ్‌గాన్‌ రాష్ట్ర డిప్యూటీ గవర్నర్‌ అహ్మద్‌ నఫీసీ చెప్పారు. హార్ముజ్‌ జలసంధి పరిసర ప్రాంతాల్లో కూడా అడపాదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇరాన్‌ డ్రోన్‌ దాడికి ప్రయత్నించిందని, అయితే దానిని తమ గగనతల రక్షణ వ్యవస్థలు తిప్పికొట్టాయని కువైట్‌ సైన్యం తెలిపింది. అలీ అల్‌ సలేం వైమానిక స్థావరం వద్ద ఉన్న అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేశామని ఇరాన్‌ సేనలు చెప్పాయి. ఇరాన్‌ దళాలు బుధవారం ఉదయం వైమానిక దాడులకు ప్రయత్నించగా వాటిని అడ్డుకున్నామని బహ్రెయిన్ తెలిపింది. దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ అంతటా సైరన్లు మోగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్