Magazines

వాణిజ్య రక్షణవాదాన్ని వ్యతిరేకిద్దాం

13 నిమిషాల క్రితం

Let us oppose trade protectionism.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

స్వేచ్ఛాయుత, బహిరంగ వాణిజ్యానికి మద్దతు ఇవ్వండి : అపెక్‌ సదస్సులో జిన్‌పింగ్‌ పిలుపు

పాశ్చాత్య దేశాల ఆంక్షలపై మండిపడిన పుతిన్‌

షెన్‌జెన్‌ (చైనా) : ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సులో బుధవారం ప్రసంగించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వాణిజ్య రక్షణవాదానికి వ్యతిరేకంగా నిలబడతామని ప్రతినబూనగా పాశ్చాత్య దేశాల ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కీలక త్రైపాక్షిక భేటీ జరగడానికి కొన్ని గంటల ముందు ఇరువురు నేతలు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జిన్‌పింగ్‌ తన ప్రారంభోపన్యాసంలో స్వేచ్ఛాయుత, బహిరంగ వాణిజ్యానికి మద్దతు ఇవ్వాలని సభ్య దేశాలను కోరారు. రక్షణవాద విధానాల కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్విడియా వంటి కంపెనీల నుంచి చైనా అధునాతన ఏఐ చిప్‌లను పొందడంపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించిన తరుణంలో జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 'ప్రపంచ వాణిజ్య సంస్థను కేంద్రంగా చేసుకున్న నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను మనం సమర్ధించాలి. స్వేచ్ఛాయుత, బహిరంగ వాణిజ్యం, పెట్టుబడులకు మద్దతు ఇవ్వాలి' అని అన్నారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో వాణిజ్యం, పెట్టుబడులపై అడ్డంకులను తొలగించాలని సూచించారు. సుంకాలను తగ్గించడంతో పాటు విదేశీ సంస్థలకు మార్కెట్‌ ప్రవేశాన్ని సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాంతీయ పురోగతికి సాంకేతిక ఆవిష్కరణలు ఎంతో కీలకమని చెప్పారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, ఏఐ, హరిత ఇంధన రంగాల్లో దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. చైనా, రష్యా కలిసి బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు.

ట్రంప్‌నకు ఘనస్వాగతం

అపెక్‌ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం షెన్‌జెన్‌ నగరానికి చేరుకున్న ట్రంప్‌కు విమానాశ్రయంలో జిన్‌పింగ్‌ స్వయంగా స్వాగతం పలికారు. సాధారణంగా విదేశీ నేతకు స్వాగతం పలకడానికి జిన్‌పింగ్‌ నేరుగా విమానాశ్రయానికి రావడం చాలా అరుదు. గత సెప్టెంబరులో అమెరికా పర్యటనకు వెళ్లిన జిన్‌పింగ్‌కు ట్రంప్‌ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇప్పుడు జిన్‌పింగ్‌ కూడా అదే విధంగా ఆయనకు ఆత్మీయ స్వాగతం అందించారు. షెన్‌జెన్‌లోని బావోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానం దిగిన ట్రంప్‌కు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం లభించింది. విమానం మెట్ల వద్ద ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇరు దేశాల పతాకాలు చేబూనిన చైనా పౌరులు, అధికారులు నినాదాలు చేస్తూ ట్రంప్‌ను స్వాగతించారు. ట్రంప్‌, జిన్‌పింగ్‌ పక్కపక్కనే నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు.


త్రైపాక్షిక భేటీపై పుతిన్‌ ఆశాభావం

ట్రంప్‌, జిన్‌పింగ్‌లతో తాను జరపబోయే త్రైపా క్షిక సమావేశం ద్వారా గణనీయ ప్రయోజనాలు చేకూరుతాయని పుతిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దేశాల రాజకీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను సమతుల్యం చేయడమే ఈ భేటీ లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరితనం కంటే వివిధ దేశాల మధ్య భాగస్వా మ్యమే మంచిదని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, ఏకపక్ష విధానాలపై ఆయన మండిపడ్డారు. చైనాతో ద్వైపాక్షక వాణిజ్యం 200 బిలియన్‌ డాలర్లు దాటిందని అంటూ ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వా మ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్