Magazines

బాబన్న జీవితం ఆదర్శం

9 నిమిషాల క్రితం

బాబన్న జీవితం కమ్యూనిస్టులకు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

పల్లె సుద్దులతో ప్రజల్ని చైతన్యం చేసిన గొంతు : సీపీఐ(ఎం) సీనియర్ నేత పి.రాజారావు

ఆశయాన్ని ఆచరణ బాట పట్టించారు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

భూక్య బాబు సంతాప సభలో పలువురు వక్తలు
కన్నీటి వీడ్కోలుతో మెడికల్ కాలేజ్ కి భౌతికకాయం అప్పగింత

నవతెలంగాణ-కొత్తగూడెం

బాబన్న జీవితం కమ్యూనిస్టులకు ఆదర్శం కావాలని, ఎర్రజెండా స్థాపన కోసం జరిగే ప్రజా పోరాటాలు, వర్గ పోరాటాలు, సామాజిక ఉద్యమాలకు మరింత పదును పెట్టి ముందుకు తీసుకుపోవడమే( భూక్య బాబు) బాబన్నకు ఇచ్చే ఘనమైన నివాళి అని సీపీఐ(ఎం) సీనియర్ నేత పి. రాజారావు, సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజా నాట్యమండలి కళాకారులు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ తండ్రి భూక్య బాబు(73) చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీలో గల భూక్య బాబన్న ఇంట్లో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ, ఇతర నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజానాట్యమండలి కళాకారులు, ఇతర పార్టీ నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో వక్తలు మాట్లాడారు. సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహిస్తూనే కార్మికులకు ఎదురయ్యే సమస్యల కోసం పోరాటాలు నిర్వహించడంలో భూక్య బాబు అగ్రబాగాన నిలిచారని గుర్తు చేసుకున్నారు. 100 ఉపన్యాసాలు కంటే ఒక కళా ప్రదర్శన గొప్ప చైతన్యాన్ని ఇస్తుందని బాబన్న నిరూపించారని తెలిపారు. గొంగళి వేసుకొని కళా ప్రదర్శన ఇచ్చి లక్షలాది మందిని ప్రభావితం చేశారని కొనియాడారు. ఆయన జీవితం నేటితరానికి ఆదర్శం కావాలన్నారు. మృతదేహాన్ని స్థానిక మెడికల్‌ ‌కాలేజీకి అప్పగించారు.


సీపీఐ(ఎం) జాతీయ, రాష్ట్ర నాయకులు, ప్రముఖుల సంతాపం
బాబన్న మరణ వార్త తెలుసుకొని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎం.సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, బండారు రవికుమార్, ప్రజాకవి జయరాజు, కొండపల్లి పావన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతు సంఘం నాయకులు అన్నవరపు సత్యనారాయణ, బొంతు రాంబాబు, వంశీ, మాదినేని రమేష్, కున్సోత్ ధర్మ , కొక్కెరపాటి పుల్లయ్య తదితరులు సంతాపం ప్రకటించారు. డాక్టర్ నాగరాజు, బి.ఎస్.రావు ఇతర రాజకీయ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు.​


​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్