Magazines

ప్రజాఉద్యమాల్లో భూపాల్‌రెడ్డి చిరస్మరణీయులు

28 నిమిషాల క్రితం

memorable
avatar
balaji

ప్రచురించబడింది నవం 18, 2026 | 2 నిమిషాల చదవడం

నిస్వార్థ కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచారు

సాగునీరు, కాలువల సాధనలో కీలకపాత్ర : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ

చౌటుప్పల్‌‌లో మాజీ సర్పంచ్ చింతల భూపాల్ రెడ్డి ప్రథమ వర్ధంతి, స్థూపావిష్కరణ


నవతెలంగాణ-చౌటుప్పల్ ​
ప్రజాసమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన చింతల భూపాల్‌రెడ్డి సేవలు చిరస్మరణీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం, విస్తరణతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన పోరాటాలు మరువలేనివని చెప్పారు. చౌటుప్పల్ పట్టణంలో బుధవారం మాజీ సర్పంచ్ చింతల భూపాల్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థూపాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ చెరువుపల్లి సీతారాములు సీపీఐ(ఎం) జెండాను అవనతం చేశారు. ఈ సందర్భంగా జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. కందాల రంగారెడ్డి నాయకత్వంలో పనిచేసిన చింతల భూపాల్‌రెడ్డి చౌటుప్పల్ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎంతోమందిని ఉద్యమాల్లోకి తీసుకొచ్చి నాయకులు గా తీర్చిదిద్దారన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు,100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో ప్రధాన భూమిక పోషించారని గుర్తుచేశారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృష్ణా జలాల సాధన కోసం పోరాడారని, సాగునీటి కోసం తెప్పలచెరువు నుంచి మల్కాపురం, కైతాపురం, ధర్మోజిగూడెం, లక్కారం గ్రామాల చెరువులకు కాలువల ద్వారా నీటిని మళ్లించేందుకు కృషి చేశారని వివరించారు. నేడు నిరుద్యోగం పెరుగుతోందని, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు సమానంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేసే శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పదవులు, అధికారాల కంటే సమసమాజ స్థాపనే లక్ష్యంగా సీపీఐ(ఎం) పని చేస్తుందని, పేదల పక్షాన పోరాటాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌ ‌మాట్లాడుతూ..


భూపాల్‌రెడ్డి చూపిన పోరాట మార్గంలో పయనిస్తూ ప్రజాసమస్యలపై ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. చింతల భూపాల్‌రెడ్డి పార్టీకి, ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ఆర్టీసీ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించిన భూపాల్‌రెడ్డి ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. అనంతరం పార్టీ విస్తరణ కోసం పూర్తికాలం కార్యక ర్తగా పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, కల్లూరి మల్లేశం, గుంటోజు శ్రీనివాసా చారి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి.పాషా, గంగాదేవి సైదులు, అవ్వారు రామేశ్వరి, రాగిరి కిష్టయ్య, కర్నాకర్‌, డివిజన్‌ ‌మాజీ కార్యదర్శి దోనూరి నర్సి రెడ్డి, నాయకులు కీసరి నర్సిరెడ్డి, బండారు నర్సిం హ, కౌన్సిలర్‌ ‌బత్తుల జయమ్మదాసు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్