Magazines

ఢిల్లీకి కాదు.. గ్రామాల‌కు వెళ్లండి

41 నిమిషాల క్రితం

Don't go to Delhi... go to the villages.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారిని గుర్తిస్తాం : 
టీపీసీసీ విస్తృత స్థాయి స‌మావేశంలో 
సీఎం రేవంత్ రెడ్డి

న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్

ప‌ద‌వుల కోసం ఢిల్లీ చుట్టూ, గాంధీ భ‌వ‌న్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌టం వ‌ల్ల ఫ‌లితం ఉండ‌బోద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత‌ల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. వెళ్లాల్సింది ఢిల్లీకి కాదు.. గ్రామాల‌కు అని వారికి సూచించారు. ఆదివారం హైద‌రాబాద్ లోని గాంధీ భ‌వ‌న్‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన విస్తృత స్థాయి స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్సే లేదు, మళ్లీ పెరగనివ్వకుండా అడ్డుకుంటామంటూ కేసీఆర్ విర్రవీగార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న కుట్ర‌ల‌ను భ‌గ్నం చేసి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చామ‌ని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన అనేక మందికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నామ‌ని తెలిపారు.

టికెట్ రాని అనేక మందికి కార్పొరేషన్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను ఇచ్చామ‌ని వివ‌రించారు. ఇందుకు భిన్నంగా ప్ర‌తిప‌క్ష పార్టీలో అన్నాచెల్లెళ్లు ప‌ద‌వుల కోసం, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని సీఎం ఈ సంద‌ర్భంగా ధీమా వ్య‌క్తం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసిన‌ప్పుడే అది సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌టానికి కావాల్సిన వ్యూహాన్ని తాము రూపొందిస్తామ‌ని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రవర్తన, మాట తీరును నిశితంగా గమనిస్తున్నామ‌ని హెచ్చ‌రించారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్లను గుర్తిస్తామ‌ని, అదే స‌మ‌యంలో కష్టపడి చెడగొట్టే వాళ్లను కూడా గుర్తుపెట్టుకుంటామ‌ని చెప్పారు.

​బ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్