Magazines

‌ఉద్యోగులు ఏఐపై అవగాహన పెంచుకోవాలి

1 గంట క్రితం

Employees should develop an understanding of AI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 3 నిమిషాల చదవడం

ఆధునిక సాంకేతికతలో అప్‌‌డేట్‌‌ కావాలి..ప్రజలకు మెరుగైన సేవలందించాలి
‎ఏఐ సాక్షమ్‌ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి

నవతెలంగాణ బ్యూరో - హైరాబాద్‌

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై అవగాహన పెంపొందించుకుని, తమ రోజువారీ విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రణాళికా శాఖ, టీజీ మ్యాథ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఏఐ శిక్షణను సద్వినియోగం చేసుకుని, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ‎హైదరాబాద్‌లోని ఎంసీఆ‌ర్‌హెచ్‌ఆర్‌డీలో ప్రణాళికా శాఖ సహకారంతో టీజీ మ్యాథ్‌ చేపట్టిన ‘ఏఐ సాక్షమ్‌’ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ‌భట్టి విక్రమార్క బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఏఐ వినియోగం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వేగవంతం కావడంతోపాటు, సామాన్య ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కారం కావాలని చెప్పారు. కార్యాలయాల్లో ఆదా అయ్యే సమయం ప్రజలకు మెరుగైన సేవల రూపంలో తిరిగి అందాలని సూచించారు. ప్రజల జీవితాల్లో కనిపించే సానుకూల మార్పే ఏఐ వినియోగానికి అసలైన గీటురాయి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగు ల సామర్థ్యాలను పెంపొందించి, పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. సాంకేతికతలో వస్తున్న మార్పుల ను ఉద్యోగులు ఎప్పటికప్పుడు అందిపుచ్చు కోవాలని కోరారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగించాలని సూచిం చారు. ‎ప్రభుత్వ ఉత్తర్వులను గుర్తించడం, నివేదికలను రూపొందించడం, సమాచారాన్ని విశ్లేషించడం, ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరాలు అందించడం వంటి పనుల్లో ఏఐ ద్వారా సమయం ఆదా చేయొచ్చని భట్టి అన్నారు. శిక్షణలో ఉద్యోగులు చురుగ్గా పాల్గొని, వారి విధులకు అనుగుణంగా ఏఐ సాధనాలను ఉపయోగించే పద్ధతులను నేర్చుకోవాలని కోరారు. రైతు దరఖాస్తు త్వరగా పరిష్కారం కావడం, పింఛనుదారుడికి అందాల్సిన ప్రయోజనాలపై స్పష్టమైన సమాచారం లభించడం, పౌరుడు ఒక పని కోసం పదేపదే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తగ్గడం వంటి మార్పులు సాంకేతికత వినియోగం ద్వారా సాధ్యపడాలని సూచించారు.‎

‎విద్యుత్‌ రంగంలోనూ ఏఐతో ప్రయోజనాలు

‎‎విద్యుత్‌ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేయడం, పరికరాల్లో తలెత్తే లోపాలను గుర్తించడం, నిర్వహణ చర్యలను మెరుగుపరచడం వంటి అంశాల్లో ఏఐ ఉపయోగపడుతుందని భట్టి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా విద్యుత్‌ నిర్వహణను మెరుగుపరిచి, రైతులు, పరిశ్రమలు, ఆస్పత్రులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ‎ఏఐ సాధనాలను ఉపయోగించే సమయంలో సమాచార భద్రత, కచ్చితత్వం, బాధ్యతకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. అనుమతి లేని సాధనాల్లో అధికారిక లేదా వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయరాదన్నారు. ఏఐ రూపొందించిన సమాచారాన్ని అధికారిక రికార్డుల్లో చేర్చే ముందు, నిర్ణయాలకు ఆధారంగా ఉపయోగించే ముందు అధికారులు ధ్రువీకరించాలని సూచించారు. సాంకేతికత సహాయంతో పనులు నిర్వహించినప్పటికీ తుది నిర్ణయాలు, వాటికి సంబంధించిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ప్రతి శాఖలో ఏఐ వినియోగానికి అనువైన పనులను గుర్తించి, ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించారు. ఫలితాలను పరిశీలించి, ప్రజలకు కలిగే ప్రయోజనం, పనితీరు, కచ్చితత్వం ఆధారంగా విస్తరణ చేపట్టాలని కోరారు. ప్రజలకు మెరుగైన ఫలితాలు, సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, డిప్యూటీ సీఎం సెక్రెటరీ, ట్రాన్స్‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీ మ్యాథ్‌ ఎండీ పూజ, ఎంసీఆర్‌హె‌చ్‌ఆ‌ర్‌‌డీ డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక, ప్రణాళికా రంగాల్లో మెరుగైన ఫలితాలు‎

‎ప్రజాధనం వినియోగాన్ని విశ్లేషించడం, ప్రాజెక్టుల వ్యయాలను పోల్చడం, పనుల అమల్లో 
జాప్యాలకు కారణాలను గుర్తించడం వంటి అంశాల్లో ఏఐ ఆధారిత సాధనాలు అధికారులకు సహాయపడగలవని భట్టి చెప్పారు. ప్రభుత్వ వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలును మెరుగ్గా పర్యవేక్షించడానికి ఈ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చన్నారు. ప్రణాళికా 
రంగంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు ఎలా అందుతున్నాయో విశ్లేషించడం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారందరికీ చేరుతున్నాయా అనే అంశాలను పరిశీలించడం ద్వారా మెరుగైన ప్రణాళికలు రూపొందించవచ్చని అన్నారు. గణాంకాలతోపాటు క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్