Magazines

ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదల

1 రోజు క్రితం

examination
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు గురువారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రెటరీ అభిలాష అభినవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాష పరీక్షతో వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయి. 25న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి పరీక్ష ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటి నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చే ఏడాది జనవరి 29, 30 తేదీల్లో, ది ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ జనవరి 29న, పర్యావరణ విద్య పరీక్షను జనవరి 27న నిర్వహిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్ మెంట్ జనవరి 20 నుంచి జనవరి 25 వరకు ముగిస్తారు. ​ఎం.ఈడీ, ఎం.పీ.ఈడీలో 192 మందికి సీట్ల కేటాయింపు ఎం.ఈడీ, ఎం.పీ.ఈడీలో 192 మందికి సీట్లు కేటాయించినట్టు టీజీసీపీగెట్(అడ్మిషన్స్)-2026 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ.పాండురంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న 269 సీట్లను భర్తీ చేసేందుకు ప్రత్యేక ఫేజ్ లో అవకాశం కల్పించగా 646 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కాగా సీట్లు లభించిన వారు నిర్దేశించిన ఫీజును చెల్లించి సంబంధిత కాలేజీలో నవంబర్ 21లోపు తగిన సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలను www.cpgetadmissions.com లో తెలుసుకోవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్