Magazines

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ

2 గంటల క్రితం

Kolli Satyanarayana as the PDF MLC candidate for the Nalgonda-Warangal-Khammam Graduates' constituency
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్)అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది కొల్లి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ఈయన 42ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.ప్రముఖ సీనియర్‌ న్యాయవాది బోడపూడి రాధాకృష్ణ శిష్యుడైన ఈయన రాజ్యసభ మాజీ సభ్యుడు వై.రాధాకృష్ణమూర్తి అన్న కుమారుడు.గతంలో మూడుసార్లు స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేశారు.ప్రస్తుతం అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు)ఉపాధ్యక్షుడిగా,రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆయనకు మద్ధతు తెలిపారు.సీపీఐ(ఎం)సైతం తమ మద్దతును అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్