ఆదివాసీ గూడాల్లో మౌలిక వసతులు కల్పించాలి
పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి..హక్కు పత్రాలివ్వాలి : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్‌కు సీపీఐ(ఎం) బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వలస ఆదివాసీలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలివ్వాలనీ, ఆదివాసీ గూడాల్లో మౌలిక వసతులు కల్పించాలనీ, పోడు సాగుదారులపై ఫారెస్టు అధికారుల దాడు లను ఆపించి హక్కు పత్రాలను ఇప్పించా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) కోరిం ది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు సీపీఐ(ఎం) బృందం వినతి పత్రాన్ని అందజేసింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, బీరెడ్డి సాంబశివ, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాములు పలు అంశా లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చత్తీస్ గఢ్- తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతా ల్లో నివాసముంటున్న ఆదివాసీల పట్ల ఫారెస్ట్ అధికారులు అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. సుమారు 5 వేలకు పైగా ఆదివాసీ కుటుం బాలు అడవిలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నా యనీ, వారందరికీ తెలంగాణ ప్రభుత్వం ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, ఉపాధి హామీ కార్డులు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, వారి గూడాలు, గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, రోడ్డు సౌకర్యాలను కల్పించలేదని తెలిపారు. ఒకే సంస్కృతి, సాంప్రదాయం, భాష కలిగి నిజమైన ఆది వాసులైనప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఎస్టీలుగా గుర్తించక పోవడం వలన వారి పిల్లలు ఉన్నత చదువులు కొనసాగించలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. వారంతా గత అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేశారన్నారు. సరైన పత్రాలు లేవనే పేరుతో ఇప్పుడు సుమారు 2 వేల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతున్న దని తెలిపారు. డబుల్ ఓట్లుంటే తొలగించాలి తప్ప సరైన పత్రాలివ్వలేదనే పేరుతో తొలగిం చకూడదని కోరారు. వలస ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలనీ, వారిపై ఫారెస్టు అధికారుల దాడులను ఆపాలని విన్నవించారు. వారు సాగు చేసుకుంటున్న భూముల్లో కంద కాలు తీయడాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఆదివాసీలు సాగులో ఉన్న భూము లకు హక్కుపత్రాలు ఇవ్వాలనీ, గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, రోడ్డు సౌకర్యా లను వెంటనే కల్పించాలని విన్నవించారు. ఆదివాసీలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రైతుబంధు , కళ్యాణ లక్ష్మి లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.






కామెంట్లు (0)