Magazines

నేటి నుంచి రాష్ర్ట స్థాయి రగ్బీ పోటీలు

53 నిమిషాల క్రితం

competitions
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నేటి నుంచి రాష్ర్ట స్థాయి రగ్బీ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆరంభం కానున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని వోక్సెన్‌ యూనివర్శిటీ వేదికగా రెండు రోజుల పాటు జరుగనున్న అండర్‌‌-15, అండర్‌-18 విభాగాల ఈ పోటీలకు అండర్‌-15 విభాగంలో 16 జట్లు, అండర్‌-18 విభాగంలో 12 జట్లు పోటీపడనున్నాయి. ఈ మేరకు టోర్నమెంట్‌ వివరాలను మంగళవారం తెలంగాణ రగ్బీ సంఘం నరేంద్ర రామ్‌ వెల్లడించారు. తెలంగాణలోని యువ క్రీడాకారులు సత్తా చాటేందుకు ఈ టోర్నమెంట్‌ ఓ చక్కటి వేదిక. క్షేత్ర స్థాయిలో రగ్బీ క్రీడను బలోపేతం చేసేందుకు జూనియర్‌ లెవల్‌ పోటీలు దోహదం చేస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రగ్బీ సంఘం కార్యదర్శి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్