Magazines

భారత్‌ సమ్మిట్‌ లక్ష్యం పెట్టుబడులే

5 గంటల క్రితం

investment
avatar
balaji

ప్రచురించబడింది నవం 14, 2026 | 3 నిమిషాల చదవడం

బీజేపీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టు కాదు

పీయూశ్‌గోయల్‌ వస్తే స్వాగతం?
రాహుల్‌గాంధీ వస్తే విమర్శలా?

కిషన్‌‌రెడ్డి, బండి సంజయ్‌...
తెలంగాణ లెక్కల్లో లేరు

భారత్‌ సమ్మిట్‌‌కు వచ్చేవారి వీసాలను తిరస్కరించడం సరిగాదు

బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు

నేటి నుంచి గిగ్‌ వర్కర్ల చట్టం అమలు :సీఎం


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమని చెప్పడం, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడమే భారత్‌ ‌సమ్మిట్‌ ‌లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి
ఎ.రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. భారత్‌ సమ్మిట్‌కు ‌వస్తున్న పలు దేశాలకు చెందిన ప్రతినిధుల వీసాలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడాన్ని తప్పు బట్టారు. దానికి బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిం చారు. బీజేపీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దేశ ద్రోహులనే ముద్ర వేసే సంస్కృతిని తప్పుబట్టారు. బీజేపీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గిగ్‌ ‌వర్కర్స్‌ ‌పాలసీని శనివారం నుంచి అమలు చేయబోతున్నామని తెలిపారు. ఆ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు శనివారం తమ పార్టీ అగ్రనేత, పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ హైదరాబాద్‌‌కు వస్తున్నారని వివరించారు. ఆయన రాకను బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌నేతలు విమర్శించడాన్ని తప్పుబట్టారు. మీరు విమర్శించినంత మాత్రాన రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్ట తగ్గదు, ఆయన ప్రజల హృదయాల్లో ఉన్నారని తెలిపారు.


శుక్రవారం హైదరాబాద్‌‌లోని నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైలలో కర్టనైజర్‌ ‌కార్యక్రమాలు నిర్వహించామనీ, త్వరలో ముంబయి, అహ్మదాబాద్‌‌లో నిర్వహించబోతున్నామని తెలిపారు. భారత్ సమ్మిట్‌‌కు 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. వివిధ రంగాల్లో వివిధ హోదాలలో ఉన్న నిపుణులు, ప్రముఖ వ్యక్తులు, జర్నలిస్టులను భారత్ సమ్మిట్‌ ఆహ్వానించి రెండు రోజులు సెమినార్లు పెట్టి చర్చించడం తప్పా అని ప్రశ్నించారు. నగరాన్ని ప్రత్యక్షంగా చూసి, పారిశ్రామిక విధానాలను తెలుసుకుంటారని భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

కేంద్ర మంత్రి జి.కిషన్‌‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌‌రావు, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇది భారత్‌ ‌వ్యతిరేక సమ్మిట్‌ అని ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. అర్ధరహిత, అధారహిత ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నా గుడ్డిగా వ్యతిరేకించడం సబబు కాదన్నారు. క్షీణించిపోతున్న విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం తమ ప్రభుత్వానికి ఉందన్నారు. తెలంగాణ వాతావరణ మార్పులు, మౌలిక వసతులు, మానవ వనరుల గురించి వివరించి రాష్ర్టాన్ని పెట్టుబడుల అనువైన కేంద్రంగా మార్చి యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్‌ ‌డాలర్లకు చేర్చడం తమ ముందు ఉన్న లక్ష్యాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిగ్‌ ‌వర్కర్ల పాలసీని తీసుకొచ్చిందనీ, ఆ పాలసీ వివరాలు వెల్లడించేందుకు రాహుల్‌‌గాంధీ వస్తున్నారని తెలిపారు.

భారత్‌ ‌సమ్మిట్‌లో ‌ముగింపు సందేశమివ్వడానికి రాహుల్‌‌గాంధీ వస్తే బీజేపీ నేతలకు అభ్యంతరమేంటని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌‌గాంధీ తమను ఓడిస్తాడనే భయం బీజేపీ నేతలకు పట్టుకుందన్నారు. ఢిల్లీలో ఇన్వెస్ట్‌ ‌తెలంగాణ గ్లోబల్‌ ‌సమ్మిట్‌‌కు కేంద్ర మంత్రి ప్లీయూష్‌ ‌గోయల్‌ ‌వస్తే వారే స్వాగతించారనీ, ఇక్కడ తెలంగాణలో రాహుల్‌ ‌గాంధీ వచ్చి మాట్లాడతారంటే వ్యతిరేకించడమేంటి? అని ప్రశ్నించారు. మోడీ ఏది చేసినా కరెక్టే..రాహుల్‌ ‌గాంధీ ఏది చేసినా తప్పే అన్నట్టు బీజేపీ నేతలు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ప్రపంచంలో శాంతి కోసం చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. వెయ్యి మంది ప్రతినిధులు ఇక్కడకొచ్చి వెళ్లేటప్పుడు తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారుతారని తెలిపారు. ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‌లను ఆహ్వానించినా హాజరు కాలేదనీ, ఎల్ నినో పై అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించినా రాలేదని తెలిపారు.


కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ లెక్కల్లో లేరని భావిస్తున్నామని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ‌ఖుర్షీద్‌ ‌మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమ్మిట్‌ ‌విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్‌‌రెడ్డి కృషిని అభినందించారు. భారతదేశం గ్లోబల్ సౌత్ దేశాలను ఒకచోట చేర్చడంలో చురుకైన పాత్ర పోషించాలనీ, దేశాల మధ్య సహకారం పెరగాలని ఆకాంక్షించారు. నాన్-అలైన్‌మెంట్ అంటే దేశ ప్రయోజనాలను బట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ అని వివరించారు. ఏదో ఒక పవర్ బ్లాక్‌తో కలవడం వల్ల నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తగ్గుతుందని హెచ్చరించారు. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల మధ్య వాతావరణ మార్పులపై సహకారం కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిక్స్‌ లాంటి గ్రూపులు పెద్ద గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌కు బిల్డింగ్ బ్లాక్స్‌లా పనిచేయాలని ఆకాంక్షించారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పు వంటి ఉమ్మడి అంశాలపై ఏకాభిప్రాయం రావాలన్నారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం ‌మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి, వివేక్‌ ‌వెంకటస్వామి, మహ్మద్‌ అజారుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్