Magazines

పెండింగ్‌ బిల్లుల సమస్యను పరిష్కరించాలి

1 గంట క్రితం

The issue of pending bills must be resolved.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

తహశీల్దార్లకు వాహన అద్దె చార్జీలు చెల్లించాలి : ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి ట్రెసా వినతి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను మంగళవారం హైదరాబాద్‌‌లోని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె గౌతమ్‌‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఎల్‌ ‌రమన్‌‌రెడ్డిలు కలిసి వినతిపత్రం అందజేశారు. గత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కాలానికి వాహన అద్దె చార్జీలు చెల్లించకపోవడం వల్ల తహశీల్దార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తహశీల్దార్లు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి విచారణలు, వివిధ న్యాయ స్థానాల్లో కోర్ట్ కేసులకు హాజరుకావడం, ప్రొటోకాల్ వంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంటారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న తహశీల్దార్ల వాహన అద్దె చార్జీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. భవిష్యత్తులో ప్రతి నెలా వాహన అద్దె బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా ఇతర శాఖల మాదిరిగా సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన గౌరవ వేతన బిల్లులు సైతం పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని మంజూరు చేయాలని కోరారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సానుకూలంగా స్పందించారని తెలిపారు. పెండింగ్‌ ‌బిల్లులకు సంబంధించిన వివరాలను టోకెన్‌ ‌నెంబర్లతో సహా సమర్పించాలని సమర్పించాలని సూచించారని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర సమన్వయకర్త ఎం నారాయణ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఏఆర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

​




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్