Magazines

ఢిల్లీ అండర్‌-19 కెప్టెన్‌గా ఆర్యవీర్‌ సెహ్వాగ్‌

17 గంటల క్రితం

Aryavir Sehwag named Delhi Under-19 captain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కుమారుడు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌కు కీలక బాధ్యత దక్కింది. 2026-27 దేశవాళీ సీజన్‌లో జరిగే వినూ మంకడ్‌ ట్రోఫీ వన్డే టోర్నీకి ఢిల్లీ అండర్‌-19 జట్టు కెప్టెన్‌గా 18 ఏళ్ల ఆర్యవీర్‌ను ఎంపిక చేశారు. ఇటీవలే భారత అండర్‌-19 జట్టులోకి అరంగేట్రం చేసిన అతడు.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల యూత్‌ వన్డే సిరీస్‌లో 28, 47, 34 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకుంది. మ్యాచుల్లో మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయానని ఆర్యవీర్‌ తెలిపాడు.


భరత అండర్‌-19 జట్టుతో ఆడిన అనుభవం తనకు కీలక పాఠాలు నేర్పిందన్నాడు. మ్యాచ్‌ను వివిధ దశలుగా విభజించుకుని ఆడటం, భారీ పరుగులు సాధించాలంటే ఎక్కువసేపు క్రీజులో నిలవడం ముఖ్యమని తెలుసుకున్నానని చెప్పాడు. ఆర్యవీర్‌ గతంలోనూ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 2024 కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో మేఘాలయపై ఢిల్లీ తరఫున 297 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ తరఫున కూడా ఆడాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్