నవతెలంగాణ - హైదరాబాద్ : ఒడిశాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కంధమాల్ జిల్లాకు చెందిన ఓ మహిళ రెండు తలలతో శిశువుకు జన్మనిచ్చింది. అక్టోబర్ 10న సిజేరియన్ ద్వారా జన్మించిన శిశువును మెరుగైన వైద్య సంరక్షణ కోసం బెర్హంపూర్లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగానికి తరలించారు. శిశువుకు ఒకే శరీరం, రెండు తలలు, రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో ‘డైసెఫాలస్ పారాపగస్’ అంటారు. 32 వారాల గర్భధారణ సమయంలో జన్మించిన ఈ శిశువు ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఈ అరుదైన జననం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




కామెంట్లు (0)