Magazines

రాష్ట్రంలో కాంగ్రెస్ శకం ముగిసింది: హరీశ్ రావు

4 గంటల క్రితం

Hareesh Rao
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: అభివృద్ధి పనుల వైఫల్యం కారణంగా ప్రజలు కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారని, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పార్టీలో ఉండటం కంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడమే మేలని భావించి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నేతలకు ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ శకం ముగిసిందని అన్నారు. 

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ నుంచి నేతలు ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌లోకి రావడం అసాధారణమని వ్యాఖ్యానించారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టలేదని, రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆయన విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్