నవతెలంగాణ - హైదరాబాద్: మహిళలతో వివాహేతర సంబంధం కారణంగా భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామనాథపురం జిల్లా పరమకుడి డీఎస్పీ జాఫర్ సిద్ధిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన 2020లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణుడై నేరుగా డీఎస్పీగా నియమితులయ్యారు. తిరువిడైమరుదూర్, అరక్కోణం డీఎస్పీగా కూడా పనిచేశారు. ఈ క్రమంలో అతనికి పలువురు మహిళలతో వివాహేతర సంబంధం ఉందని, తనను చిత్రహింసలు పెడుతున్నాడని అతని భార్య డీజీపీకి ఫిర్యాదు చేశారు. విచారించిన ఉన్నతాధికారులు ఆరోపణలు నిజమని తేలడంతో జాఫర్ సిద్ధిక్‌ని సస్పెండ్‌తో పాటు సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
వివాహేతర సంబంధాలు.. డీఎస్పీ అరెస్టు
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)