Magazines

ద్రోహ రాజకీయాల తాత్కాలిక విజయం: టీవీకే విజయంపై స్టాలిన్‌

1 గంట క్రితం

mk stalin
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తమిళనాడులోని ధరాపురం, మధురాంతకం అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) విజయం సాధించింది. అయితే, ఈ ఫలితాలపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఇది "ద్రోహ రాజకీయాల తాత్కాలిక విజయం" అని అభివర్ణించిన ఆయన, "తప్పుడు ప్రతిష్ఠ రాజకీయాల పతనం మొదలైంది" అని వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా వేదికగా శుక్రవారం స్టాలిన్ స్పందిస్తూ, అధికార టీవీకేకు వ్యతిరేకంగా పోలైన ఓట్లను గమనిస్తే, మెజారిటీ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించినట్లేనని విశ్లేషించారు. ఎమ్మెల్యేల బేరసారాలు, ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టడం, కక్ష సాధింపు చర్యలు, అనాగరిక చర్చలను మానుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో రీల్స్ చేయడంపై కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి విజయ్‌ దృష్టి సారించాలని హితవు పలికారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్