నవతెలంగాణ - హైదరాబాద్: ఓట్ చోరీ అంశంపై విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ షర్మిల చేపట్టిన "ఛలో లోక్‌భవన్" ఉద్రిక్తతకు దారి తీసింది. చేతిలో రాజ్యాంగం పట్టుకుని కారు నడుపుకుంటూ వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. దేశంలోని ఓట్లన్నీ తొలగించుకుంటూ పోతే బీజేపీ నాయకుల ఓట్లు తప్ప ఇంకెవరివీ మిగలవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీ కార్యకర్తగా, ప్రధాని మోడీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ‘దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించడం దుర్మార్గపు చర్య. జ్ఞానేశ్ రాజీనామా చేయాలి, పవిత్రమైన ఓటును బీజేపీ చోరీ చేస్తోంది. మోడీ ఓట్ల గజదొంగ. ఈసీ మోడీ చెప్పుచేతల్లో పనిచేస్తోంది’ అని షర్మిల ఆరోపించారు.





కామెంట్‌లు (0)