నవతెలంగాణ - హైదరాబాద్: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శనివారం నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చిన సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీప్కే ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. నా ప్రాణం తీసినా.. ఉద్యమం ఆగదన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం యువత నిరసనలకు భయపడుతోందా? అని నిలదీశారు. ఢిల్లీలో భారీగా భద్రతా బలగాల మోహరింపుపై విమర్శలు గుప్పించారు. నిరసనల్లో పాల్గొనకుండా బీజేపీ నాయకులు, పోలీసులు ప్రజలను అడ్డుకుంటున్నారనీ, శాంతియుత నిరసన రాజ్యాంగం కల్పించిన హక్కు అనీ, అరెస్టులకు భయపడను.. పోరాటం కొనసాగిస్తానన్నారు.
మోడీ ప్రభుత్వం యువత నిరసనలకు భయపడుతోంది: దీప్కే
58 నిమిషాల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)