Magazines

జనసేన ఎమ్మెల్యేపై పవన్‌ సీరియస్‌

1 గంట క్రితం

Pawan
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న ఆరోపణల వ్యవహారంపై డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. బాలరాజుపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు పవన్ కల్యాణ్ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం పార్టీలో అంతర్గతంగా కలకలం రేపుతోంది. గతంలోనే బాలరాజును పార్టీ కార్యాలయానికి పిలిపించి, గిరిజన ప్రజలకు పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించాలని, వారి సేవకే అంకితం కావాలని పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా సూచించారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై పవన్ తీవ్ర అసహనం, విసుగుతో ఉన్నట్లు పార్టీ ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్