నవతెలంగాణ - హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపినందుకు అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కాదని, ఇందుకోసం యువతను జైలులో పెట్టడం పిరికిపంద చర్య అని విమర్శించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జంతర్ మంతర్లోకి ప్రవేశించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్టు చేశారు.
కోర్టు వారికి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరో నేత అజింక్యా షిండే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. ఈ అరెస్టులపై ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. జంతర్ మంతర్ భారత ప్రజలదని, పౌరుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య థాకరే తదితర విపక్ష నేతలు కూడా అరెస్టులను ఖండించారు.






కామెంట్లు (0)