Magazines

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

1 గంట క్రితం

Unable to bear dowry harassment, married woman commits suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అనకాపల్లిలో వరకట్న వేధింపులు తాళలేక శ్రీవాణి (25) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖపట్నానికి చెందిన ఆమెకు 2022లో అనకాపల్లికి చెందిన మళ్ల ముకుంద విజయ్‌తో వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. అదనపు కట్నం కోసం భర్త విజయ్, అత్త సత్యవతి, మామ పైడికృష్ణ వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రింగురోడ్డు ప్రాంతంలోని నివాసంలో శ్రీవాణి బలవన్మరణానికి పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ నరసింహారావు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్