Magazines

ఈస్ట్‌‌ జోన్‌ 708/10

08 సెప్టెంబర్, 2026

Ishan Kishan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-చెన్నై : దులీప్‌ ‌ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ ‌జోన్‌ ఇరగదీసింది. తొలి రెండు రోజులు బ్యాటింగ్‌ ‌చేసిన ఈస్ట్‌ ‌జోన్‌ 163 ఓవర్లలో 10 వికెట్లకు 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ ఇషాన్‌ ‌కిషన్‌ (270, 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్‌‌లు) భారీ డబుల్‌ ‌సెంచరీతో కదం తొక్కగా.. కుమార్‌ ‌కుశాగ్ర (101, 132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌‌లు), అభిమన్యు ఈశ్వరన్‌ (72, 86 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), శిఖర్‌ ‌మోహన్‌ (85), అనుకూల్‌ ‌రాయ్‌ (45), వైభవ్‌ ‌సూర్యవంశీ (44), ఖురేషి (40), మహ్మద్‌ ‌షమి (28) రాణించారు. సౌత్‌ ‌జోన్‌ ‌బౌలర్లలో త్రిపుణ విజయ్‌ (4/180), సివి మిలింద్‌ (2/88), శ్రేయాస్‌ ‌గోపాల్‌ (2/165), షేక్‌ ‌రషీద్‌ (1/46) ‌వికెట్లు పడగొట్టారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్