ముంబయి : దేశంలోని అతిపెద్ద ప్రయివేటు రంగ దిగ్గజం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నూతన ఎండి, సిఇఒ పదవికి అనుప్ బగ్చీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నియామకానికి సంబంధించి ఆర్బిఐ పరిశీలన చేస్తోంది. ప్రస్తుతం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సిఇఒగా కొనసాగుతున్న 55 ఏళ్ల అనుప్ బగ్చీ ఈ కీలక పదవికి ప్రధాన అభ్యర్థిగా రేసులో ముందున్నారు. ఈ నేపథ్యంలో బగ్చీ అభ్యర్థిత్వంపై అభిప్రా యాలను కోరుతూ ఐసిఐసిఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ బక్షీకి, అలాగే బీమా నియంత్రణ సంస్థ అయిన ఐఆర్డిఎఐ అధికా రులకు ఆర్బిఐ లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కైజాద్ భరూచా పేరును కూడా ఈ పదవికి సూచించినట్లు తెలుస్తోంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఒ రేసులో అనుప్ బగ్చీ.. !
3 రోజుల క్రితం
Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 23, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)