Magazines

స్టీల్‌ దిగుమతులే ఎక్కువ

2 గంటల క్రితం

Steel imports predominate.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

ఎగుమతుల కంటే 5 లక్షల టన్నులు అదనం
న్యూఢిల్లీ : భారత్‌ నికర ఫినిష్డ్ స్టీల్ దిగుమతిదారుగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–ఆగస్టు మధ్య దేశం 3.487 మిలియన్ టన్నుల ఫినిష్డ్ స్టీల్‌ను దిగుమతి చేసుకుంది. గతేడాది ఇదే కాలంలోని 2.692 మిలియన్ టన్నులతో పోలిస్తే దిగుమ తులు 29.5 శాతం పెరిగాయి. దిగుమతుల విలువ కూడా రూ.26,172.6 కోట్ల నుంచి 38.3 శాతం పెరిగి రూ.36,193.9 కోట్లకు చేరింది.మరోవైపు ఇదే కాలంలో ఫినిష్డ్ స్టీల్ ఎగుమతులు 34.1 శాతం పెరిగి 2.98 మిలియన్ టన్నులకు చేరాయి. వీటి విలువ రూ.23,646.6 కోట్లుగా నమోదైంది. దీంతో దిగుమతులు ఎగుమతుల కంటే దాదాపు 0.51 మిలియన్ టన్నులు అధికంగా ఉన్నాయి. చైనా, కొరియా, జపాన్, ఇండోనేషియా, వియత్నామ్‌ భారత్‌కు ప్రధాన స్టీల్ సరఫరాదారులుగా ఉన్నాయి. హాట్ రోల్డ్, కోల్డ్ రోల్డ్ ఉత్పత్తులతో పాటు గాల్వనైజ్డ్ షీట్లు, ప్లేట్లు, బార్లు, రాడ్ల దిగుమతులు అధికంగా ఉన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్