Magazines

గాంధీ స్ఫూర్తితో వాసవి యూత్‌ సేవా బాట

49 నిమిషాల క్రితం

Gandhi jayanthi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - రామకృష్ణాపూర్
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రామకృష్ణాపూర్‌ పట్టణంలోని సూపర్‌ బజార్‌ ప్రాంతంలో గల ఆర్య వైశ్య సంఘం స్థలంలో శుక్రవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పేద ప్రజలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి యూత్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.


వాసవి యూత్‌ ఆధ్వర్యంలో తొలి సేవా కార్యక్రమంగా 30 మంది వృద్ధులకు దుప్పట్లు, బ్రెడ్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని పేదలు, వృద్ధులు, అవసరమైన వారికి అండగా నిలిచేలా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. సమాజ సేవలో యువత భాగస్వామ్యాన్ని పెంచే దిశగా వాసవి యూత్‌ పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వాసవి యూత్‌ సభ్యులు, ఆర్య వైశ్య సంఘం పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్