Magazines

తహశీల్దార్‌ ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని రైతు ఆత్మహత్య

58 నిమిషాల క్రితం

suicide
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: అధికారులు తమ భూ సమస్య పరిష్కరించడం లేదని కారణంతో ఓ రైతు తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలం పారుపల్లికి చెందిన లవప్ప తన భూ సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను తరచూ విజ్ఞప్తి చేస్తున్నాడనీ, అయినా ఎవరూ పట్టించుకోకవపోవడంతో శనివారం తహశీల్దార్‌ ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్