- పట్టుబడిన వాహనాల వేలం
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన నాటుసారా, మద్యం, బెల్లంతో పాటు పటికను అధికారులు బుధవారం ధ్వంసం చేశారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య ఆదేశాల మేరకు, సీఐ రాజశేఖర్రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 6 కేసులకు సంబంధించి 10.50 లీటర్ల నాటుసారా, 12.6 లీటర్ల మద్యం, 9 బీరు సీసాలు, 2 కిలోల బెల్లం, 6 కిలోల పటికను నిబంధనల ప్రకారం నాశనం చేశారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలకు అధికారులు వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ జానయ్య మాట్లాడుతూ.... అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ముఖ్యంగా ఆలయాలు, పాఠశాలల పరిసరాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ దందాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







కామెంట్లు (0)