- సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
- సత్తుపల్లిలో ఘనంగా వైఎస్సార్ వర్థంతి
నవతెలంగాణ-సత్తుపల్లి
రాజకీయాల్లో నేటి తరానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. వైఎస్సార్ 15వ వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతను నిలబెడుతూ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. మహానేతగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఆయన సేవలను నిత్యం స్మరించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు గాదె చెన్నారావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దామెర రమేష్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)