Magazines

అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు

6 రోజుల క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 19, 2026 | 1 నిమిషాల చదవడం

జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్
నవతెలంగాణ-అచ్చంపేట
నాగర్ కర్నూల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీలో చదువుకుంటున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అక్టోబర్ 11 నుంచి 17 వరకు సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్ శనివారం నవతెలంగాణతో తెలిపారు. సెంటర్లు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ నాగర్ కర్నూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ హైస్కూల్ నాగర్ కర్నూల్ లో పరీక్షలు జరగనున్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు అక్టోబర్ 23 నుంచి 30 వరకు జరగనున్నాయని తెలిపారు. విద్యార్థులు ఓపెన్ స్కూల్ సెంటర్ లో హాల్ టికెట్ తీసుకోవాలని కోఆర్డినేటర్ సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్