Magazines

ఘనంగా ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం

5 గంటల క్రితం

Formacist Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 1 నిమిషాల చదవడం

ఫార్మసీ అధికారి బాలరాజ్ ను సన్మానించిన వైద్య బృందం

నవతెలంగాణ - తిమ్మాజిపేట

మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని వైద్య సిబ్బంది శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఫార్మసీ అధికారి బాలరాజ్ ను వైద్య సిబ్బంది ఆయా గ్రామాల సర్పంచులు కేక్ కట్ చేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఫార్మసీ అధికారి బాలరాజ్ ఎమ్మెస్సీ మెడికల్ ఫార్మా కాలజీ పీజీ పూర్తి చేసి ఔషధాలు మీద మంచి పట్టు ఉన్నందున ఆసుపత్రికి వచ్చే రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడము సరైన మోతాదులో డ్రగ్స్ ఇవ్వడానికి అవకాశం వచ్చింది.


మెడికల్ కాలేజీలో ట్యూటర్ ఎంబిబిఎస్ విద్యార్థులకు చదువు చెప్పే అర్హత కలిగి ఉండడం వల్ల గత పది సంవత్సరాలుగా రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నాడు. వారి సేవలను గుర్తించి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ప్రజలు సన్మాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సరిత, రాజు ఎమ్ఎల్ హెచ్ పి నరేందర్ ఎంపిహెచ్ఈఓ సిహెచ్ఓ పర్వతాలు స్టాఫ్ నర్స్ రోస్లిన్ ఆశ వర్కర్లు గ్రామ సర్పంచులు అబ్బాసల్లి వెంకటయ్య, రామాంజనేయులు, తిరుపతిరెడ్డి, తదితరులు వున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్