Magazines

వాగులో డంపింగ్ చెత్తను వెంటనే తొలగించాలి

1 గంట క్రితం

Dumping garbage
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

 స్మశాన వాటికను వెంటనే ఏర్పాటు చేయాలి 

 నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులోని వాగులో వేసే చెత్తను వెంటనే తరలించలని, వైకుంఠ ధామం (స్మశాన వాటిక) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలేరు పట్టణంలో శనివారం ఒకటవ వార్డ్ కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్, తోటి కౌన్సిలర్లు యాట శివ, పాషికంటి సంపత్ తో కలిసి  మున్సిపల్ కమిషనర్‌ కే శ్రీనివాస్ రెడ్డికి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్ మాట్లాడుతూ ఒకటవ వార్డు పరిధిలో చెత్త డంపింగ్ చేయడం వల్ల  ప్రజలు, అటుగా వెళుతున్న వాహనదారులు, బస్సులలో ప్రయాణించి, ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.  నిత్యం ఇళ్ల నుండి సేకరించే చెత్తను వేయడానికి సరైన స్థలం లేక, పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  దీనికి తోడు పట్టణంలోని వ్యర్ధాలు అన్ని తీసుకువచ్చి ఈ వాగుపక్కనే వదిలి వేయడంతో దుర్గంధం వెదజల్లుతుందన్నారు.


వార్డులో స్మశాన వాటిక (వైకుంఠ ధామం) లేకపోవడం వల్ల ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రెండు సమస్యలు ప్రజల ప్రాథమిక అవసరాలకు సంబంధించినవని, కాబట్టి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి తగిన స్థలాన్ని కేటాయించి డంపింగ్ యార్డ్, స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్