Magazines

జుక్కల్ నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి సహకరించండి

03 సెప్టెంబర్, 2026

mla thota lakshmikantha rao

mla thota

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 1 నిమిషాల చదవడం

- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

నవతెలంగాణ - జుక్కల్ 

జుక్కల్ నియోజకవర్గ సమగ్ర రహదారుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ని సచివాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  మర్యాదపూర్వకంగా కలిశారు.

 ఈ భేటీలో నియోజకవర్గంలో రూ. 63.41 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హచ్ఏఎమ్( HAM ) రోడ్ల పనుల శంకుస్థాపన ఏర్పాట్లతో పాటు పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా ​ప్రధాన ముఖ్యాంశాలను మంత్రి తో చర్చించడం జరిగింది. రూ. 63.41 కోట్లతో హచ్ఏఎమ్ రోడ్లకు త్వరలోనే శంకుస్థాపన చేయాలని కొరారు . జుక్కల్ నియోజకవర్గంలో హచ్ఏఎమ్ ఫేజ్-1 కింద మంజూరైన 54.31 కి.మీ రోడ్ల పటిష్టత పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రితో చర్చించారు.


​అన్నసాగర్ - పిట్లం రోడ్డు (10.50 కి.మీ) - ₹ 12.16 కోట్లు

​మద్దెలచెరువు - మెదక్ జిల్లా సరిహద్దు (పిట్లం మీదుగా) (19.40 కి.మీ) - ₹ 21.49 కోట్లు

​బాన్సువాడ - బిచ్కుంద రోడ్డు (24.41 కి.మీ) - ₹ 29.76 కోట్లు

​ఎన్ హెచ్  NH-161 నుండి చెందేగాం రోడ్డు ఆర్‌అండ్‌బీకి బదిలీ చేయాలని అన్నారు.ఎన్ హెచ్NH-161 నుండి ఏక్లార, జి.మద్నూర్ మీదుగా చెండేగావ్ వరకు గల రోడ్డును పంచాయతీ రాజ్ (PR) నుండి త్వరలోనే రోడ్లు, భవనాల శాఖ (R&B) పరిధిలోకి బదిలీ చేసి, సరికొత్త బీటీ రోడ్డు నిర్మాణానికి తక్షణ అనుమతులు మంజూరు చేస్తామని  మంత్రి  స్పష్టమైన హామీ ఇచ్చారు. మంత్రి గారితో పాటు, ఆర్&బి చీఫ్ ఇంజనీర్ మరియు ఇతర సిబ్బంది తో సమీక్ష లో పాల్గొన్నారు స్థానిక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, పలు సూచనలు చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్