Magazines

జ్యోతిబాపూలే ఆశయాలను సాధిద్దాం!

47 నిమిషాల క్రితం

cpiml
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

ఆదివారం రోజున సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో భీంగల్ మండల కేంద్రంలోని సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలదండ వేసి వారి ఆశయాలను సాధిద్దామని న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు అల్తాఫ్, భువనేశ్వరులు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 153 వవార్షికోత్సవ సందర్భంగా పూలే ఆశయ సాధనకు బడుగు బలహీన వర్గాల ప్రజలు అంకితమై పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. దేశంలో ప్రజల మధ్య కుల అసమానతలు పెరుగుతున్నాయని వాటిని నిరోధించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని వారు సూచించారు.

కులం మతం లేని మనుషులంతా సమానమని భావాలను సమాజంలో పెంపొందించాలని వారు పేర్కొన్నారు .కుల అణచివేతకు, వివక్షతకు వ్యతిరేకంగా పీడిత వర్గాలు అణగారిన వర్గాలు పోరాడాలని పిలుపునిచ్చారు. కుల వివక్షత పాటించే వారి పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని తెలియజేశారు. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం మిగులు భూములను పంచాలని కోరారు. కుల మతాలకు అతీతంగా జరిగే వివాహాలను ప్రోత్సహించాలని సూచించారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు బీసీలకు తగినంత రిజర్వేషన్ సౌకర్యాన్ని పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాసంఘాల నాయకులు బాలకిషన్, భాస్కర్ యూసుఫ్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్