త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్
నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన డ్రైవర్ కారులోంచి బయటకు రావడంతో ప్రాణనష్టం జరగలేదు. అయితే, కారు మాత్రం పూర్తిగా కాలి బూడిదైంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారులో శంషాబాద్ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ వెంటనే గమనించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారును రోడ్డు పక్కకు ఆపి, వాహనం నుంచి కిందకు దిగిపోయాడు. కొన్ని క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి కారును పూర్తిగా చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, వారు వచ్చేసరికే కారు పూర్తిగా దగ్ధమైంది.
ఇంజిన్ వేడెక్కడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
బెంగళూరు-హైదరాబాద్ హైవేపై కారు దగ్ధం
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)