Magazines

రెండేండ్లలో మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే: కేటీఆర్‌

1 గంట క్రితం

ktr
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ కు అధికారం మాత్రమే పోయిందనీ, పార్టీ పట్ల ప్రజలకు ప్రేమ అలాగే ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆదివారం శంషాబాద్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మూడేళ్ల కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్‌లో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. శాంతిభద్రతలు గాలికి వదిలేసి, పోలీసులు కాంగ్రెస్‌ నేతల మాటలే వింటున్నారని ఆరోపించారు. రెండేళ్లలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్